Visakhapatnam: నాలుగు రోజుల పసికందు కిడ్నాప్.. ఒకరు నర్సులా, మరొకరు ఆయాలా వచ్చి..
Visakhapatnam: విశాఖ కేజీహెచ్‌లో పసికందు కిడ్నాప్ అయింది. ఇద్దరు మహిళలు ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.;
Visakhapatnam: విశాఖ కేజీహెచ్‌లో పసికందు కిడ్నాప్ అయింది. ఇద్దరు మహిళలు ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. గైనిక్ వార్డు నుంచి తీసుకెళ్లి కేజీహెచ్ ఔట్ గేట్ వద్ద ఆటో ఎక్కినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డైంది. గురుద్వార వద్దకు చేరుకోగానే ఓ మహిళ ఆటో దిగిన దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు వేగవంతం చేశారు. ఎక్కడికక్కడ ఆటోలు, బస్సులను తనిఖీ చేస్తున్నారు.
పద్మనాభం మండలం రౌతుపాలేనికి చెందిన అప్పాయమ్మ ఈ నెల 13న కేజీహెచ్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నిన్న రాత్రి ఏడున్నర సమయంలో ప్రసూతి వార్డుకు ఇద్దరు మహిళలు వచ్చారు. ఒకరు నర్సులా, మరొకరు ఆయాలా వచ్చి పాపను పరీక్షించాలని చెప్పి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పాయమ్మకు అనుమానం వచ్చి బంధువులను పంపిస్తామని చెప్పింది. దీనికి నిరాకరించిన మహిళలు బలవంతంగా పాపను తీసుకెళ్లారు. దీంతో బాధితురాలు సిబ్బందికి సమాచారం ఇచ్చింది. కిడ్నాప్ అయినట్లు గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.