East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం..
East Godavari: తూర్పుగోదావరి జిల్లా కాపవరంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.;
East Godavari: తూర్పుగోదావరి జిల్లా కాపవరంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు మాయమాటలు చెప్పి.. అత్యాచారం చేశాడు. బాలిక కోసం తల్లి, అమ్మమ్మ ,బంధువులు వెతుకుతుండగా బైక్‌పై వచ్చి వదిలేసి వెళ్లిపోయారు కిరాతకుడు. బాలికకు రక్తస్రావాన్ని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.