లారీ ఢీకొని 70 గొర్రెలు మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో చోటు చేసుకుంది. గొర్రెల కాపరులు తెలిపిన వివరాల ప్రకారం..నారాయణపేట జిల్లా మక్తల్ మండలం, ముష్టిపల్లి గ్రామానికి చెందిన కురువ వెంకటయ్య ,పోలప్ప అనే రైతులకు చెందిన గొర్రెల మందలను మేపుకొని దేవరకద్ర నుంచి తమగ్రామం ముష్టిపల్లికి వస్తుండగా..వరకద్ర మండలం,పెద్ద గోప్లాపూర్ శివారులో గురువారం రాత్రి మరికల్ వైపు వస్తున్న లారీ గొర్రెల మందపై వెనుక నుంచి వెళ్లడంతో 70 గొర్లు అక్కడికక్కడే నుజ్జు నుజ్జు అయ్యాయి. డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.