బిగ్ బ్రేకింగ్ : అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ వద్ద ఘోర ప్రమాదం
అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.;
విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఫ్లైఓవర్ కింద నుంచి వెళుతున్న ట్యాంకర్ లారీ, కారుపై రెండు భీమ్‌లు కూలిపడ్డాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన లారీ డ్రైవర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జలగలమధు జంక్షన్ వద్ద కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది.