Palnadu: 'ఆ సీఐ, నా భార్య, మరో వ్యక్తి నా చావుకు కారణం'.. గుంటూరులో సెల్ఫీ వీడియో కలకలం..
Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలో మస్తాన్ రావు అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్‌కు యత్నించాడు.;
Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలో మస్తాన్ రావు అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్‌కు యత్నించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. తన చావుకు నరసరావుపేట టూటౌన్ సీఐ వెంకట్రావు, తన భార్య రాధిక, అనిల్ అనే మరో వ్యక్తి కారణమంటూ పురుగుల మందు తాగాడు. మస్తాన్ రావు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఏరియా హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.
మస్తాన్‌రావుకు ఆయన భార్యకు మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. వివాదం పరిష్కరిస్తామని పిలిచిన సీఐ వెంకట్రావు చిత్ర హింసలకు గురి చేశాడని ఆరోపించాడు మస్తాన్ రావు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగినట్లు వీడియోలో చెప్పాడు. తన దగ్గర బంగారం, డబ్బులు తీసుకుని సీఐ వేధిస్తున్నాడని ఆరోపించాడు.