Gachibowli : గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..!
గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.;
Gachibowli : గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన కృతి.. నానక్ రాంగూడలోని అపార్ట్‌మెంట్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటోంది. ఎవరూ రూంలో లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫ్రెండ్ సచిన్‌కు మెసేజ్ పంపింది. కృతి మెసేజ్ చూసిన సచిన్ వెంటనే రూమ్‌కు వచ్చాడు. అఫ్పటికే కృతి ఉరికి వేలాడుతూ కనిపించింది. హాస్పిటల్‌కు తరలించినా.. అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు.. కాగా కృతి ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు.