Khammam Police: ఇల్లాలే ఇంటిదొంగ.. ప్రియుడి కోసం..!
Khammam Police: ప్రియుడితో కలిసి జీవించేందుకు కట్టుకున్న భర్త ఇంట్లోనే చోరీ చేసిన ఇల్లాలు ఉదంతాన్ని ఖమ్మం పోలీసులు ఛేదించారు.;
Khammam Police: ప్రియుడితో కలిసి జీవించేందుకు కట్టుకున్న భర్త ఇంట్లోనే చోరీ చేసిన ఇల్లాలు ఉదంతాన్ని ఖమ్మం పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త ఇంటి నుంచే బంగారం,వెండి నగలను దొంగిలించి నగదుగా మార్చేందుకు ప్రయత్నించింది. ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన భర్త.. పోలీసులను ఆశ్రయించాడు. దీనితో పోలీసులు రంగంలోకి దిగి చాకచక్యంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 63 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు.