Crime News : నెల్లూరు జిల్లాలో యువకుడు దారుణ హత్య

Update: 2025-09-10 06:57 GMT

గూడూరు గాంధీనగర్ స్మశాన వాటిక సమీపంలో యువకుడు దారుణ హత్య జరిగింది...రహీద్ భాష (మున్నా ) 35 అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. యువకుడు మృతదేహం రోడ్డు పక్కనే రక్తపు మడుగులో పడి ఉండడంతో స్థానికులు గుర్తించారు...మృతుడు టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు... మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు...హత్య పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు...డీఎస్పీ గీతా కుమారి హత్య జరిగిన ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు...ఘటన స్థలానికి చేరుకున్న యువకుడి కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద బోరున విలపించారు... హత్య సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు...

Tags:    

Similar News