సినీ నటుడు విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు విశ్వక్ సేన్ ఇంట్లోకి ప్రవేశించి రూ.2 లక్షల విలువైన డైమండ్ రింగను చోరీ చేశారు. విశ్వక్సేన్ తండ్రి రాజు తెల్లవారుజాము సమయంలో తమ ఇంటి ఎదుట బైక్ పార్క్ చేసిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేశాడని, నిందితులను పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విశ్వక్ సేన్ ఇంటికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపి వేలిముద్రలు సేకరించారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాలలోని సీసీ ఫుటేజ్ను సైతం పరిశీలించారు. తెలిసిన వ్యక్తులే దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించడంతో పాటు ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నారు.