Rapido Driver : మైనర్ బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

Update: 2024-05-23 07:40 GMT

సికింద్రాబాద్ కు చెందిన 16 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ర్యాపిడో డ్రైవర్ పై తుకారం గేట్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ మైనర్ బాలిక తరచూ ఫోన్లో మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు.

ఈనెల 19న ఆ బాలిక తల్లిదండ్రులపై అలిగి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అదే రోజు తమ కుమార్తె మైనర్ బాలిక కనిపించడం లేదని తుకారంగేట్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన మైనర్ బాలికను హబ్సిగూడలో వర్కింగ్ మెన్ హాస్టల్లో ఉంటూ ర్యాపిడో డ్రైవర్ గా పని చేస్తున్న సందీప్ గమనించాడు. ఒంటరిగా వెళుతున్న బాలిక వద్దకు వెళ్లి ఎక్కడికి వెళుతున్నావని అంటూ పరిచయం పెంచుకున్నాడు. ఆ బాలికను మాయమాటల్లో పెట్టి వాహనంపై ఎక్కించుకుని కూకట్ పల్లి, కొండాపూర్, ట్యాంక్ బండ్ వంటి తదితర ప్రాంతాలలో తిప్పాడు. కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కాచీగూడలోని లాడ్జీలో అత్యాచారానికి గురైన బాలిక ఏడుస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డిని అరెస్ట్ చేసి పోక్సోతో పాటు పలు కేసులు పెట్టి లోపలేశారు.

Tags:    

Similar News