Rape Case : RCB బౌలర్ యశ్ దయాళ్ పై మరో అత్యాచార కేసు

Update: 2025-07-25 09:30 GMT

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్ యశ్ దయాళ్ పై మరో అత్యాచార కేసు నమోదైంది. గతంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక యువతి అతనిపై లైంగిక వేధింపులు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపించిన నేపథ్యంలో, ఇప్పుడు రాజస్థాన్ కు చెందిన ఒక యువతి కూడా సంచలన ఆరోపణలు చేసింది. క్రికెట్ లో కెరీర్ చూపిస్తానని నమ్మించి తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని రాజస్థాన్ కు చెందిన ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు రాజస్థాన్ పోలీసులు యశ్ దయాళ్ పై పోక్సో కేసు నమోదు చేశారు. రాజస్థాన్ లోని సీతాపురంలో ఒక హోటల్ కు పిలిచి అక్కడ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఆ తర్వాత రెండేళ్లపాటు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడని యువతి చెబుతోంది. బాధితురాలు మైనర్ గా, 17 ఏళ్ల వయసులో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా యశ్ దయాళ్ ను కలిసినట్లు పేర్కొంది. కెరీర్ సలహా ఇస్తానని హోటల్ కు పిలిచి లైంగిక దాడి చేశాడని తెలిపింది. • గతంలో, ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఒక మహిళ యశ్ దయాళ్ పై లైంగిక దోపిడీ, శారీరక హింస, పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించింది. ఈ కేసులో ఐదేళ్లపాటు సంబంధంలో ఉన్నామని ఆమె పేర్కొంది.

Tags:    

Similar News