సిద్దిపేట జిల్లా ములుగులో అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న 34 గోవులను భజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. సిద్దిపేట వైపు నుండి హైదారాబాద్ కు వీటిని తరలిస్తున్నట్లుగా తెలిసింది. గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ 34 గోవులను గోశాలకు తరలించినున్నట్లుగా భజరంగ్ నేతలు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చట్టాల అమలుతో గోవద నిర్మూలనకు కృషి చేస్తుండగా కొందరు అక్రమార్కులు మాత్రం పట్టించుకోకుండా యధేచ్చగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి అక్రమ తరలింపునకు అడ్డుకట్టవేసేలా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయాలన్నారు.