Chekwume Malvin : డ్రగ్స్ కేసులో సింగం నటుడు అరెస్ట్ ... !
Chekwume Malvin : హీరో సూర్య హీరోగా వచ్చిన సింగం సినిమాలో విలన్‌గా నటించిన నైజీరియన్దేశస్థుడు, నటుడు చాక్విమ్మాల్విన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.;
Chekwume Malvin : హీరో సూర్య హీరోగా వచ్చిన సింగం సినిమాలో విలన్‌గా నటించిన నైజీరియన్దేశస్థుడు, నటుడు చాక్విమ్మాల్విన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా బెంగుళూరు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్ఆయిల్సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్ టైంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో అతడు డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ఆఫ్రికా నుంచి అక్రమంగా తరలించిన డ్రగ్స్‌ను అతడు విక్రయించేవాడని సమాచారం. చాక్విమ్కి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అతను ఎన్నేళ్ళ నుంచి ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు? ఇందులో ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. కాగా చాక్‌విమ్ కన్నడ సహా హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించాడు. తమిళ్ లో సింగం, విశ్వరూపం సినిమాలలో నటించాడు.