Teacher Harassment : గురుదక్షిణగా నాకు ప్రియురాలుగా ఉండు.. విద్యార్థినితో టీచర్ అనుచితంగా
బిహార్ లోని కిసాన్‌గంజ్ జిల్లాలో వికాస్ అనే టీచర్ 12వ తరగతి విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించాడు. ఏకలవ్యుడు గురువుకు బొటన వేలును కోసి ఇచ్చినట్లుగా తనకు గురుదక్షిణగా ప్రియురాలిగా ఉండాలని కోరాడు. , టీచర్ వికాస్ కుమార్ వేధింపులపై ఆ విద్యార్థిని విసిగిపోయింది. స్కూల్‌లోని కొందరు టీచర్లకు ఈ విషయం చెప్పింది. అలాగే హెడ్‌మాస్టార్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి ఇది వెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. బాలిక మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె పేరెంట్స్, గ్రామస్థులు స్కూల్ ఎదుట ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించి విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే వికాస్ కుమార్ గతంలో అదే స్కూల్‌లో పని చేసిన మహిళా టీచర్‌కు ప్రపోజ్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు