Lucknow: పబ్ జి మాయలో పడి తల్లిని చంపిన బాలుడు.. రెండురోజులు శవంతోనే..
Lucknow: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 17 ఏళ్ల బాలుడు పబ్‌జీ ఆటకు అలవాటు పడ్డాడు.;
Lucknow: వీడియో గేమ్స్, స్మార్ట్ ఫోన్స్ అనేవి ఈమధ్య యూత్ మనసులో బలమైన ముద్రను వేస్తున్నాయి. వాటి కోసం ఎంత దూరం వెళ్లడానికి అయినా వారు వెనకాడడం లేదు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనే దీనికి ఉదాహరణ. పబ్‌బీ ఆడడం వ్యసనంగా మార్చుకున్నాడు. తన తల్లి వద్దని చెప్పడంతో తనను చంపడానికి కూడా వెనకాడలేదు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 17 ఏళ్ల బాలుడు పబ్‌జీ ఆటకు అలవాటు పడ్డాడు. దానికి తన తల్లి కాదనడంతో గన్ తీసుకొని తనను కాల్చేశాడు. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఇంటికి దూరంగా ఉంటున్నాడు. సాధ్నా.. తన 17 ఏళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల కూతురితో లక్నోలో జీవిస్తోంది. అదే సమయంలో కొడుకు వీడియో గేమ్స్‌కు అలవాటు పడుతున్నాడని తల్లి మందలించడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు ఆ బాలుడు. తన తండ్రి తుపాకీతోనే తల్లిని చంపినట్టు పోలీసులు చెప్తున్నారు.
తల్లికి చంపడం తన చెల్లి చూడడంతో తనను కూడా బెదిరించాడు బాలుడు. అనంతరం తల్లి శవాన్ని ఏసీ రూమ్‌లో పడేశాడు. రెండు రోజుల తర్వాత శవం నుండి కుళ్లిన కంపు రావడంతో తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పాడు బాలుడు. దీంతో తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. మొదట ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుందామనుకున్న బాలుడు.. పోలీసులు గట్టిగా అడగడంతో నిజం ఒప్పుకున్నాడు. అంతే కాకుండా తాను అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతోనే ఆ బాలుడు.. తల్లిని చంపినట్టు కూడా కథనాలు వినిపిస్తున్నాయి.