Crime : పల్నాడులో మద్యం మత్తులో యువకుడి దారుణ హత్య.

Update: 2025-09-11 07:20 GMT

పల్నాడు జిల్లా,మాచర్లలో మద్యం మత్తులో యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. మాచర్ల నుండి శ్రీశైలం వెళ్లే రోడ్డులో ఉన్న పొలాల్లో మద్యం సేవించేందుకు నలుగురు స్నేహితులు వెళ్ళారు. అందరూ కలిసి మద్యం సేవిస్తుండగా తలెత్తిన ఘర్షణలో చంద్రశేఖర్ (21) అలియాస్ బాబును రాయితో మోదీ హత్యచేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించబోయిన పోలీసులను అడ్డుకున్నారు మృతుని బంధువులు. హత్య చేసిన వారి వివరాలు తమకు చెప్పేవరకు మృతదేహాన్ని తరలించబోమని బంధువులు ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News