Eluru District : వృద్ధులను టార్గెట్ చేస్తూ చోరీలు.. దొంగలు అరెస్ట్!

Update: 2025-07-05 16:00 GMT

ఏలూరు జిల్లాలో వృద్ధులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ చోరీలకు పాల్పడుతున్న కేసులను పోలీస్ యంత్రాంగం ఛేదించింది. కైకలూరు రూరల్ పరిధిలో వృద్ధులను కొట్టి బంగారు ఆభరణాలు దోచుకెళ్ళిన దొంగలను పట్టుకున్న పోలీసులు, భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో విలేకరుల సమావేశంలో ఊలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ కేసుల వివరాలు వెల్లడించారు. కైకలూరు మండలం రామవరంలో ఒంటరిగా జీవిస్తోన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ పట్టుకున్నారు. రామవరం గ్రామంలో భర్త చనిపోయి గూడూరు నాగలక్ష్మి ఒంట రిగా ఉంటుంది. మే నెల 28తేదీ రాత్రి 9.20గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు ఆమె తలకు ముసుగు వేసి చేతులతో ముఖంపై తీవ్రం గా కొట్టి గోడకు తలను కొట్టారు. ఆమె సృహతప్పి పడిపోవటంతో మెడలోని ఐదు కాసుల బంగారు చైన్, రెండు చేతులకు ఉన్న రెండు బంగారపు గాజులు లాక్కుని చనిపోయిందనే ఉద్దేశ్యంతో పరారయ్యారు. కొంతసేపటికి కోలుకున్న వృద్ధురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. కైకలూరు మండలం రామవరం గ్రామానికి చెందిన పంతగాని జానకుమార్, గరికిముక్కు రాజ్కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 40 గ్రాముల బంగారు చైన్, 24గ్రాముల రెండు బంగారు గాజులు రికవరీ చేశారు.

Tags:    

Similar News