లంగర్ హౌజ్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి
హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు..;
హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు.. వందవ పిల్లర్ నెంబర్ వద్ద డీవైడర్‌ను ఢికొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో.. మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.