Karimnagar : వేములవాడలో కారు గల్లంతు.. బాలుడు, మహిళ మృతి

Karimnagar : కుండపోత వానలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి;

Update: 2022-09-11 08:52 GMT

Karimnagar : కుండపోత వానలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. వేములవాడ రూరల్ మండలం ఫాజూల్‌ నగర్ వద్ద వంతెనపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో.. ప్రయాణికుల కారు చిక్కుకుంది. కారులో నలుగురు ఉన్నట్లు గుర్తించిన స్థానికులు... డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి కాపాడారు. కారు నీటమునగటంతో మహిళతోపాటు బాలుడు మృతి చెందాడు. జగిత్యాల జిల్లా చల్‌గల్‌ నుంచి కారు హైదారాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

Tags:    

Similar News