మహబూబ్‌నగర్ (TG)కు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికా పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. MS చేసేందుకు 2016లో USకు వెళ్లిన అతడు జాబ్ లేకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ‘రూమ్‌మేట్స్ మధ్య గొడవ జరుగుతోందని SEP 3న కాల్ వచ్చింది. నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేస్తున్నాడు. కంట్రోల్ చేసేందుకు కాల్పులు జరిపాం. గాయాలతో అతడు మరణించాడు’ అని పోలీసులు తెలిపారు. తన కొడుకు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో సహాయం కోసం హస్నుద్దీన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో, “నిజాముద్దీన్‌ను శాంటాక్లారా పోలీసులు కాల్చి చంపారని, అతని మృతదేహాన్ని కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో ఉంచారని తెలిసింది. పోలీసులు అతనిని ఎందుకు కాల్చారో తెలియదు” అని పేర్కొన్నారు.