తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ నుంచి సైబర్ దాడి జరిగిందని ఎలాన్ మస్క్ తెలిపారు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఏం జరిగిందో తమకు కచ్చితంగా తెలియదని అన్నారు. కాని ఉక్రెయిన్ ప్రాంతం నుంచి వచ్చిన ఐపీ అడ్రస్ ల నుంచే ఎక్స్ వ్యవస్థలను కూల్చేందుకు భారీ సైబర్ దాడి జరిగిందని స్పష్టం చేశారు. నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన ఈ దాడి ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో ఎక్స్ సేవల అంతరాయానికి దారి తీసిన విషయం తెలిసిందే. సర్వీసె ఇంటరప్షన్స్ ను ట్రాక్ చేసే సైట్ ..డౌన్డెటెక్టర్ ప్రకారం వినియోగదారులు ఎక్కువ కాలం ఎక్స్ ను యాక్సెస్ చేయలేక పోయారు. అయితే ఎక్స్ లో అంతరాయం ఏర్పడడం కొత్తేమీ కాదు. గత సంవత్సరం డొనాల్డ్ ట్రంప్ తో ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిన ఇంటర్వ్యూ సమయంలోనూ ఇలాంటి సైబర్ దాడి జరిగింది. డోజి డిజైనర్ అనే ఎక్స్ ఖాతా నుంచి వచ్చిన పోస్ట్ ను షేర్ చేయడం ద్వారా మిస్టర్ మస్క్ తన వాదనలను బలంగా వినిపించారు.