Cyber Fraud : 4 కోట్ల సైబర్ మోసం.. పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితురాలు
రైలులో హర్యానా (Haryana) నుంచి పూణెకు (Pune) తీసుకెళ్తుండగా ఓ మహిళ పోలీసుల నుంచి తప్పించుకుంది. రూ.4 కోట్ల సైబర్ మోసానికి సంబంధించి ఆమెను ఫిబ్రవరి 20న అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 17న హర్యానాలోని ఫరీదాబాద్‌లోని తన ఇంటి నుంచి అరెస్టు చేసిన నిందితురాలు సానియా (24) అలియాస్ గుడియా అలియాస్ సోఫియా సిద్ధిక్ ఆదివారం తెల్లవారుజామున పరారైనట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) తెలిపారు.
ఒక మహిళా కానిస్టేబుల్, నలుగురు పురుష కానిస్టేబుళ్లతో కూడిన పూణే పోలీసుల బృందం ఆమెను అరెస్టు చేసి, దురంతో ఎక్స్‌ప్రెస్‌లో పూణేకు తీసుకువెళుతున్నట్లు వారు తెలిపారు. అంతకుముందు రూ.4 కోట్ల సైబర్ మోసానికి సంబంధించి సానియాపై పూణేలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
రైలు రత్లాం స్టేషన్‌కు చేరుకోగానే మహిళ తప్పించుకుందని పుణె పోలీసు బృందం గుర్తించింది. ఈ బృందం మహిళ కోసం శోధించింది. సీసీటీవీ ఫుటేజీలపై విచారణ ప్రారంభించారు. మహిళ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని కోటలోని జిఆర్‌పి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ సోని తెలిపారు. అక్కడి నుంచి వెళ్లే ముందు ఆమె ఇక్కడి మాలా రోడ్డులోని ఓ లాడ్జిలో కొన్ని గంటలపాటు బస చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు.