Hyderabad : హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌పై దాడి..
Hyderabad : హైదరాబాద్ చైతన్యపురిలో దారుణం జరిగింది. స్థానిక భవాని చౌరస్తాలో కిక్ బాక్సింగ్ తరహాలో డెలివరీ బాయ్ కిరణ్‌పై దాడి చేశారు ముగ్గురు యువకులు;
Hyderabad : హైదరాబాద్ చైతన్యపురిలో దారుణం జరిగింది. స్థానిక భవాని చౌరస్తాలో కిక్ బాక్సింగ్ తరహాలో డెలివరీ బాయ్ కిరణ్‌పై దాడి చేశారు ముగ్గురు యువకులు. అడ్డు వచ్చిన మరో డెలవరీ బాయ్‌పై కూడా పిడిగుద్దుల వర్షం కురిపించారు. మద్యం మత్తులోనే యువకులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో బాధితుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు ఆస్ట్రేలియాకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.