కడుపులో కాటన్ మరచిపోయి కుట్లు .. మహిళ మృతి..!
యాదాద్రి భువనగిరిలోని కేకే ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళ మృతికి డాక్టర్లే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.;
యాదాద్రి భువనగిరిలోని కేకే ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళ మృతికి డాక్టర్లే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఉత్రిక్తత వాతారవరం చోటు చేసుకుంది. భూవనగిరిలోని కేకే ఆస్పత్రిలో గత ఏడాది అనారోగ్యం కారణంగా ఓ మహిళ ఆపరేషన్ చేయించుకుంది. అయితే కడుపులో కాటన్ మరచిపోయి డాక్టర్లు కుట్లు వేశారు. ఆమె దాదాపు 6 నెలల పాటు కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారు. దీంతో అసలు విషయం బయటపడింది. పరిస్థితి విషమించి ఆమె మరణించడంతో... మృతురాలి బంధువులు కేకే ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమె డెడ్‌బాడీతో నిరసన తెలిపారు. ఆస్పత్రిపై దాడి చేసి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.