Hyderabad Crime: అన్నదమ్ముల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది..
Hyderabad Crime: చెల్లెలి వివాహానికి పెట్టిన ఖర్చు విషయంపై ఇద్దరి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది.;
Hyderabad Crime (tv5news.in)
Hyderabad Crime: చెల్లెలి వివాహానికి పెట్టిన ఖర్చు విషయంపై ఇద్దరి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అనంతరం ఘర్షణకు దారి తీయడంతో ఒకరు అసువులుబాసారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం అల్వాల గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీనివాసులు, యాదగిరి అన్నదమ్ములు. వీరి చెల్లెలి వివాహం ఇటీవలే జరిగింది. అయితే.. ఖర్చు పెట్టిన డబ్బుల విషయంపై ఇద్దరి మధ్య గొడవ మొదలై ఘర్షణకు దారితీసింది. శ్రీనివాసులు కత్తితో యాదగిరిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలై అతను మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి వీరు కంటెయినర్‌లో శంషాబాద్ గండిగుడా వద్దకు రాగా వివాదం చెలరేగింది