మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి నిర్మల్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును దొంగి లిం చేందుకు విఫలయత్నం చేసిన వ్యవహారం ఆదివారం రాత్రి నిర్మల్ పట్టణంలో చోటు చేసుకుంది.
నిర్మల్ పట్టణం లోని ఆర్టీసీ డిపోలో ఉన్న ఆర్టీసీ బస్సు ను గోడ దూకి వచ్చి బస్సు స్టార్ట్ చేసుకొని వెళ్తుండగా చూసిన ఆర్టీసీ సిబ్బంది మోటార్ సైకిల్ పై వెంబడించి సోఫీనగర్ వద్ద పట్టుకున్నారు.
దొంగలించిన వ్యక్తి బస్సును తీసుకెళ్తున్న సమయంలో సోఫీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పటికే ఆర్టీసీ సిబ్బంది అక్కడికి చేరుకొని బస్సును స్వాధీనం చేసుకొని దొంగిలించిన వ్యక్తిని పోలీసులకు అప్ప చెప్పారు.