Father Suicide : కొడుకు బాగుపడటం లేదని తండ్రి సూసైడ్

Update: 2024-04-12 10:04 GMT

కన్న ప్రేమ బరువైన వాస్తవాలను కొన్నిసార్లు జీర్ణించుకోలేదు. జీవితంలో మంచి వాడవుతున్నాడనుకున్న కొడుకు దారికి రాకపోవడంతో తండ్రి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.

అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధి ఉప్పర్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బేగంబజార్‌కు చెందిన దేవిదాస్‌ అగర్వాల్‌ (50) ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఉప్పర్‌పల్లిలో నివాసం ఉండేందుకు వచ్చాడు. ఇక ఇతనికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కుమార్తె మానసిక దివ్యాంగురాలు. కుమారుడు మహదేవ్‌ క్యాబ్‌ డ్రైవర్. ఇటీవలే పెళ్లిఅయింది. కారు కొనేందుకు తండ్రి ఇటీవల కొంత డబ్బుని కొడుక్కి ఇచ్చాడు. ఐతే.. కష్టపడి సంపాదించిన సొమ్మును కొడుకు దుర్వినియోగం చేయడంతో తండ్రి అసహనం వ్యక్తం చేశాడు.

తండ్రీకొడుకుల మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోంది. మనస్తాపం చెందిన తండ్రి దేవిదాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. గది అద్దెకు కావాలని ఓ అపార్ట్‌మెంట్‌ కు వెళ్లి పదో అంతస్తు పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు దేవిదాస్ అగర్వాల్. దీంతో .. బాధిత కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Tags:    

Similar News