West Godavari: పసికందును అమ్మకానికి పెట్టిన కన్నతండ్రి.. భార్యకు తెలియకుండా..
West Godavari: తల్లిపొత్తిళ్లలో సేదతీరాల్సిన పసికందును అమ్మకానికి పెట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది.;
West Godavari: తల్లిపొత్తిళ్లలో సేదతీరాల్సిన పసికందును అమ్మకానికి పెట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. డబ్బులకు కక్కుర్తిపడి బిడ్డను అమ్ముకున్నవిషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం .. అల్లిపల్లికి చెందిన అరుణ్ కుమార్, చిలుకమ్మ దంపతులకు అశ్వారావు పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మించింది.
భార్య మత్తులో ఉండగానే భర్త అరుణ్ కుమార్ అత్త మేరీతో కలిసి.. చింతలపూడి మండలానికి చెందిన ఆర్ ఎంపి వైద్యులు బుచ్చిబాబు, శ్రీనివాసుల సహాకారంతో విశాఖకు చెందిన వ్యక్తికి 2లక్షలకు అమ్మేశాడు. డెలివరీకి సంబంధించి అల్లిపల్లి అంగన్ వాడీ టీచర్ విజయలక్ష్మి ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఈ విషయాన్ని గుర్తించిన శిశుసంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పసిబిడ్డ విక్రయంపై అరుణ్ కుమార్‌తోపాటు ఇద్దరు ఆర్‌ఎంపీ డాక్టర్లు, ప్రశాంతిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.