Pune: ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి అనుమానాస్పద మృతి..
Pune: మహారాష్ట్రలోని పూణేలో ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతిచెందడం కలకలం సృష్టించింది.;
Pune: మహారాష్ట్రలోని పూణేలో ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతిచెందడం కలకలం సృష్టించింది. హాస్టల్‌లోని తన రూమ్‌లో ఉరివేసుకొని కనిపించాడు అశ్విన్ అనురాగ్ శుక్లా. ప్రాథమికంగా దీనిని ఆత్మహత్యగా నిర్ధారించారు పోలీసులు. కానీ సూసైడ్ లెటర్ లాంటిది ఏమీ దొరకలేదని తెలిపారు. 2017లో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన అశ్విన్.. సినిమాటోగ్రాఫీ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు.