విజయవాడ రాహుల్ హత్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు
విజయవాడలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.;
విజయవాడలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో A1గా కోరాడ విజయ్ కుమార్ పేరును చేర్చారు. అలాగే A2గా కోగంటి సత్యం, A3గా పద్మజ, A4గా పద్మజ, A5గా గాయత్రి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. A1 నిందితుడు కోరాడ విజయ్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక A2గా ఉన్న కోగంటి సత్యంను కూడా అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.