హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఎస్సార్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచు దగ్గరికి చేరుకోగానే బస్ ఆగిపోయింది. ఇంజన్ స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించడంతో బస్సులో నుంచి పొగలు ప్రారంభమై మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికుల్ని వెంటనే దించివేయడంతో ప్రమాదం తప్పింది. సెల్ఫ్ మోటర్ కి బ్యాటరీ కి కనెక్ట్ చేసిన వైర్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులకు సేఫ్ గా ఉన్న వారి లగేజ్, లాప్టాప్ లు సెల్ ఫోన్లు అన్ని అగ్నికి దగ్ధమయ్యాయి. బస్సులో మంటలు వచ్చే సమయానికి ముగిసిన మెట్రో సర్వీసెస్. అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగ మెట్రో స్టేషన్ మొత్తం అలుముకుంది. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.