Pregnant Woman Suicide : ఉరి వేసుకున్న ఐదు నెలల గర్భిణీ.. మగ బిడ్డ పోరు పడలేక!
కృష్ణా జిల్లా పెనమలూరు యనమలకుదురులో అమానుషం చోటుచేసుకుంది. 5 నెలల గర్భవతి సందు కావ్యశ్రీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది కావ్యశ్రీ. దీంతో.. భర్త, అత్తమామలు రెండో కాన్పులో మగబిడ్డ ఇవ్వాలని కావ్యశ్రీపై ఒత్తిడి పెంచారు.
విజయవాడలో స్కానింగ్ భర్త శ్రీకాంత్ స్కానింగ్ తీయించడంతో కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలింది. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని భర్త ఒత్తిడి చేశాడు. ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్ కు కావ్యశ్రీ చెప్పింది. తమకు వారసుడుని ఇవ్వాలని అత్త, మామ కూడా కోడలిని వేధించినట్టు సమాచారం. శ్యామ్ అనే కానిస్టేబుల్ స్కానింగ్ తీసుకెళ్లాడని బంధువులు ఆరోపించడం కూడా కావ్యశ్రీపై ఒత్తిడి పెంచింది.
ఆత్మహత్యకు ముందు తన భర్తకు మెసేజ్ చేసింది కావ్య శ్రీ. మీకు వారసుడిని ఇవ్వలేను అని భర్తకు మెసేజ్ చేసింది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి కావ్యశ్రీని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెనమలూరు పోలీసులు.