ట్రేడింగ్‌లో అధిక లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి నగర వాసి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 78,70,500 కాజేశారు. అయితో బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసి రూ. 39 లక్షలు బాధితుడికి తిరిగి ఇప్పించారు. సైబర్‌క్రైమ్స్ డీసీపీ దార కవిత కథనం ప్రకారం.. నగరానికి చెందిన నిరుద్యోగ యువకుడికి స్టాక్ ట్రేడింగ్‌లో లాభాలిప్పిస్తామంటూ సైబర్‌నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని ఇన్స్‌పెక్టర్ మధుసూదన్‌రావు బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసిన రూ. 39 లక్షల నగదును కోర్టు అనుమతితో బాధితుడికి తిరిగి ఇప్పించారు. కాగా, డబ్బులు ఎక్కువ వస్తాయనే అత్యాశకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.