గచ్చిబౌలిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. పశ్చిమగోదావరికి చెందిన రవికృష్ణ, నాగ పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి నుండి 5.5 కిలోల గంజాయి, 5 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి..సులువుగా డబ్బు సంపాదించడం కోసం గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. విస్వసనీయ సమాచారంతో గచ్చిబౌలిలోని ఓ హోటల్ వద్ద గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు తెలిపారు రాయదుర్గం పోలీసులు.