Shamshabad : శంషాబాద్‌లో భారీ గంజాయి పట్టివేత..
Shamshabad : వైజాగ్ టూ మహారాష్ట్ర వయా హైదరాబాద్ అన్నట్లుగా సాగుతున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాకు చెక్ పెట్టారు;
Shamshabad : వైజాగ్ టూ మహారాష్ట్ర వయా హైదరాబాద్ అన్నట్లుగా సాగుతున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాకు చెక్ పెట్టారు రాజేంద్రనగర్ పోలీసులు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్‌ఓటీ టీమ్, రాజేంద్ర నగర్ పోలీసులు... ఔటర్ రింగ్ రోడ్డుపై మాటువేసి లారీలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 50లక్షల విలువచేసే 236 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఖాళీ డ్రమ్ములు పెట్టిన ముఠా లోపల డ్రమ్ముల్లో గంజాయి బస్తాలను నింపి తరలిస్తున్నట్లు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు పైలట్‌గా ముందు వస్తున్న కారులోని జయరామ్, యోగేష్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.