Hyderabad Cylinder Blast : గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి..
Hyderabad Cylinder Blast : హైదరాబాద్ లింగంపల్లి రైల్ విహార్ దగ్గర గోడౌన్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది.;
Hyderabad Cylinder Blast : హైదరాబాద్ లింగంపల్లి రైల్ విహార్ దగ్గర గోడౌన్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు గాయపడ్డారు. బాదం మిల్క్ షేక్ తయారీకి చెందిన గోడౌన్‌లో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాటికి గోడ కూడా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు... హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. బ్లాస్టింగ్ కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.