Nizamabad: నింద భరించలేక బాలిక ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం శివతండాలో విషాదం నెలకొంది. దొంగతనం నింద భరించలేక వందన అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది;
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం శివతండాలో విషాదం నెలకొంది. దొంగతనం నింద భరించలేక వందన అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. వందన ఫోన్ పౌచ్‌లో ఉన్న 6 వందల రూపాయలు దొంగిలించిందని పక్కింటి వ్యక్తులు ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన వందన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
తల్లితో ఫోన్ మాట్లాడేందుకు వందన పక్కింటి ప్రవీణ్ ఫోన్ తీసుకుంది. ఫోన్‌లో మాట్లాడాక తిరిగి ఇచ్చేసింది. ఐతే.. ఫోన్ పౌచ్‌లో ఉన్న 6 వందల రూపాయలు తీసుకుందని వందనపై ప్రవీణ్, ఆయన తల్లి ఆరోపించారు. చేయని తప్పుకు నింద వేశారని మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ ప్రవీణ్, ఆయన తల్లి బులిబాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు.