Visakhapatnam : విశాఖలో దారుణం... మద్యం తాగించి బాలికపై అత్యాచారం
Visakhapatnam : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. యారాడ కొండపై ఘటన చోటుచేసుకుంది.;
Visakhapatnam : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. యారాడ కొండపై ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అక్కచెల్లెళ్లు పెదగంట్యాడలో తిరునాళ్లకు వచ్చారు. గణేష్ అనే యువకుడితో కలిసి ఓ బాలిక యారాడ కొండపైకి వెళ్లింది. వారి వెంటే మైలపల్లి రాజు అనే యువకుడు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరికి మద్యం తాగించి.. బాలికపై అత్యాచారం చేశాడు రాజు.
గణేష్ అనే యువకుడు రాజుకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. తమ కుటుంబ సభ్యులకు బాలిక ఫోన్ చేస్తే ఎంతకీ తీయకపోవడంతో డయల్ 100కు కాల్ చేసిందని.. నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారన్నారు. నిందితులిద్దరిపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేశామని తెలిపారు.