Sonali Phogat : సోనాలి ఫోగట్ నిజంగానే గుండెపోటుతో మృతి చెందిందా..? లేదంటే..
Sonali Phogat : బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.
Sonali Phogat : బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. హర్యానకు చెందిన ఆమె గోవాలో మృతిచెందటంపై ఎన్నో ప్రశ్నలు తలెతుత్తున్నాయి.దీనిపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. సోనాలి ఫోగట్ మృతిపై సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు. ఆమె గుండెపోటు కారణంగా మృతిచెందినట్లు వైద్యులతో పాటు గోవా డీజీపీ జస్పాల్ సింగ్ ప్రాథమికంగా నివేదిక ఇచ్చారు. సోనాలి ఫోగట్ మృతికి అసలు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.