GST Movie Director : జీఎస్టీ సినిమా డైరెక్టర్ జానకిరామ్ ఆత్మహత్య.. వీడని మిస్టరీ

Update: 2024-08-07 08:30 GMT

లాడ్జి గదిలో జీఎస్టీ సినిమా డైరెక్టర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్ కర్నూల్ కు చెందిన కొమారి జానయ్య అలియాస్ జానకిరామ్ ఆదివారం సాయం త్రం భాగ్యనగర్ కాలనీలోని ఓ లాడ్జిలో దిగారు.

సోమవారం లాడ్జి చెక్ అవుట్ చేయాల్సి ఉన్నా, గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది, కిటికీ నుంచి చూడగా జానకిరామ్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఉండటాన్ని గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జానకిరామ్ గతంలో "గాడ్ సైతన్ టెక్నాలజీ" (జీఎస్టీ) అనే చిత్రాన్ని స్వీయ దర్శ కత్వంలో నిర్మించినట్లు సమాచారం. ఆయన మృతికి గల కారణాలు వెల్లడికావాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News