హైదరాబాద్ పాతబస్తీలో కాల్పుల కలకలం రేపింది. ఇంటి కొనుగొలు విషయంలో ఇరువర్గాల మధ్య గొడవలో కాల్పులు జరిపాడు న్యాయవాది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాతబస్తీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.