కుల్సుంపురాలో కలకలం రేపుతున్న బాలిక ఆత్మహత్య
హైదరాబాద్ కుల్సుంపురాలో ఇంటర్ సెకండియర్ అమ్మాయి ఆత్మహత్య సంచలనం రేపుతోంది;
హైదరాబాద్ కుల్సుంపురాలో ఇంటర్ సెకండియర్ అమ్మాయి ఆత్మహత్య సంచలనం రేపుతోంది. భరత్‌నగర్ బస్తీలో రాత్రి నవ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐతే..క్షుద్రపూజల వల్లే నవ్య ఆత్మహత్య చేసుకుందన్న తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలిక ఇంటి ముందు పసుపు, నిమ్మకాయలు గుర్తించారు. ఈ నేపథ్యంలో క్షుద్రపూజల వల్లే నవ్య ఆత్మహత్య చేసుకుందా? లేక ఆత్మహత్య వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.