హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో కిడ్నాప్ కలకలం రేపింది. యశ్వంత్ అనే యువకుడ్ని ఫైనాన్సర్ శ్రీనాథ్‌రెడ్డి కిడ్నాప్ చేయించారని..బాధితుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 118(1), 127(2) BNS సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2.హోలీ పండుగ రోజు బజాజ్ షోరూమ్ గ్రౌండ్స్‌లో యశ్వంత్‌పై బీర్‌బాటిల్స్, హకీస్టిక్స్, బెల్టులతో దాడి చేసినట్లు బాధితుడు వీడియో రిలీజ్ చేశాడు. దాడికి పాల్పడిన శ్రీనాథ్‌రెడ్డితో పాటు మరో 15 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. శ్రీనాథ్ ఫైనాన్స్ పేరుతో 10 రూపాయలు, 15 రూపాలయల వడ్డీ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.