Hyderabad : 9 ఏళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి

Hyderabad : హైదరాబాద్‌లో 9 ఏళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపుతోంది.

Update: 2022-07-20 08:30 GMT

Hyderabad : హైదరాబాద్‌లో 9 ఏళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. మధురానగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణ రెడ్డి రెండో కూతురు వర్షిత కిరాణా షాపునకు వెళ్తున్నానంటూ తల్లికి చెప్పి బయటకు వచ్చింది. ఆ తర్వాత తన డాడీ చంద్రపురి కాలనీలో ఉన్నాడని చెప్పిఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్‌ డబ్బులు ఉన్నాయా అని అడగగా.. 50 రూపాయలు ఉన్నాయని సమాధానం చెప్పింది. అనంతరం ఓ బిల్డింగ్‌ వద్దకు చేరుకున్న వర్షిత.. మూడో అంతస్తు నుంచి దూకింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాప మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారి వర్షిత అసలు.. బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్లింది? ఎలా పడిపోయింది తెలియాల్సి ఉంది. వర్షితది హత్యా, ఆత్మహత్యా లేక ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనంలో ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీని సైతం పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News