కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవుల్లో ఓ చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొల్లాపూర్ నల్లమల అడవుల్లోని అమరిగిరి గ్రామానికి వెళ్లే రోడ్డుకు సమీపంలో చిన్న గండి అటవీ ప్రాంతంలో ఓ చెట్టు కింద చిరుత పులి విగతజీవై పడి ఉన్నది. చిరుత కళేబరం కుళ్లి పురుగులతో కూడి, దుర్వాసన రావడంతో..చూస్తే మూడు నాలుగు రోజుల క్రితం చనిపోయినట్టు అటవీ అధికారులు ప్రాథమిక అంచనకు వచ్చారు.సంఘటన స్థలంలోనే చనిపోయిన చిరుతకు కొల్లాపూర్ నుంచి వెటర్నరీ డాక్టర్ ను రప్పించి పోస్టుమార్టం చేయించినట్లు అటవీ శాఖ వర్గాలు ధ్రువీకరించాయి