Chittoor : చంద్రగిరిలో మరో లోన్ యాప్ బాధితుడు..
Chittoor : తిరుపతి జిల్లా చంద్రగిరిలో లోన్ యాప్ వేధింపులు కలకలం రేపుతున్నాయి;
Chittoor : తిరుపతి జిల్లా చంద్రగిరిలో లోన్ యాప్ వేధింపులు కలకలం రేపుతున్నాయి. శ్రీనివాస మంగాపురానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ సంపత్‌కుమార్.. మూడు విడతలుగా 13వేలు లోన్ తీసుకుని వడ్డీతో సహా చెల్లించాడు. అయితే ఇంకా బాకీ ఉన్నావంటూ పలు లోన్ యాప్‌ల నిర్వాహకులు వరుస మెసేజ్‌లతో వేధిస్తున్నారని బాధితుడు వాపోయాడు. బాకీ చెల్లించకుంటే కాంటాక్ట్ లిస్ట్‌కు ఫోటోలు మార్ఫింగ్ చేసి పంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.