విశాఖలోని మాధవ ధార శ్రీ మాధవ స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. సుమారు రూ.10 లక్షల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయ అర్చకులు వరాహ నరసింహస్వామి మంగళవారం ఉదయం ఆలయానికి రాగా.. తలుపులు తెరిచి ఉండటం గమనించారు.
వెంటనే లోపలకు వెళ్లి చూడగా స్వామివారి విగ్రహా లకు పెట్టిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లు నిర్ధారించి, కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ పోలీసులు, క్లూస్ టీం ఆలయానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
అపహరణకు గురైన బంగారం వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో అర్చకులు పేర్కొన్నారు.