Online Loan Debts : ఆన్‌లైన్ యాప్‌తో అప్పులు.. ఒకరి ఆత్మహత్య

Update: 2024-06-24 07:22 GMT

ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగేకు చెందిన గొడిశాల పైడ (41) అనే వికలాంగుడు ఆన్లైన్ యాప్ ద్వారా రుణాలు తీసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఈఎంఐలు చెల్లించలేక మనస్తాపంతో ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. 18 సంవత్సరాల క్రితం గోడిశాల రజితతో పైడయ్యకు వివాహం జరిగింది. వారికి నేత్ర అనే కూతురు ఉంది. మృతుని భార్య రజిత గ్రామంలో రేషన్ డీలర్ గా పనిచేస్తోంది.

గత కొంతకాలంగా తన భర్త తనకు తెలియకుండా ఆన్లైన్ యాప్ ద్వారా రుణాలు తీసుకున్నాడని.. దీంతో అప్పులు తీర్చలేక మనస్తాపంతో బాధపడేవాడన్నారు కుటుంబసభ్యులు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకొని మృతిచెందాడన్నారు. తన మృతికి ఆన్ లైన్ అప్పులే కారణమని లెటర్ రాసి జేబులో పెట్టు కున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని చిట్యాల సామాజిక వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు.

మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News