ఏపీలో మరో దారుణం జరిగింది. ప్రియురాలి మోజులో కట్టుకున్న ఓ భార్యని కడతేర్చాడో భర్త. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలం మంగపల్లెలో చోటుచేసుకుంది. హత్యకు నిందితుడి అమ్మమ్మ, తల్లి, సోదరి సహకరించినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. విజయ్ శేఖర్ రెడ్డి, ఇందుజ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కాగా, విజయ్ శేఖర్ రెడ్డికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో దీంతో ఇద్దరి మధ్య కుటుంబ కలహాలున్నాయి. భార్య ఇందుజ అడ్డు తొలగించుకోవాలని హత్యకు శేఖర్ రెడ్డి, పథకం వేశాడు. ఈ క్రమంలోనే అమ్మమ్మ, తల్లి, సోదరి సాయంతో ఇందుజ గొంతు నులిమి హత్యకు పాల్పడ్డాడు. ఇందుజ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.