Drugs : డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మోడల్, అతని గర్ల్ ఫ్రెండ్
Drugs : మోడల శుభమ్ మల్హోత్రా, అతని గర్లఫ్రెండ్ కీర్తి, డ్రగ్స్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు
Drugs : గ్లామర్ ఇండస్ట్రీలో మరో డ్రగ్ రాకెట్ బయటపడింది. మోడల శుభమ్ మల్హోత్రా, అతని గర్లఫ్రెండ్ కీర్తి.. ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్‌లో డ్రగ్స్ కొనుగోలు చేసి ఢిల్లీ యూనివర్సిటీలో విక్రయిస్తున్నట్లు పోలీసులు కనుగ్గొన్నారు. రూ. కోటి విలువ చేసే డ్రగ్స్‌తోపాటు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మోడల్ మల్హోత్రా గర్ల్‌ఫ్రెండ్ కీర్తి.. తాను గర్భవతిని అని పోలీసులను నమ్మించి మోసం చేసేదని దర్యాప్తులో తేలింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు పక్కా సమాచారం అందుకొన్న పోలీసులు.. వారిని వెంబడించి పట్టుకున్నారు. బాలీవుడ ఇండస్ట్రీలో డ్రగ్స్ ఓ భాగం అయిపోయిందని పలువురు సినీప్రముఖులు అభిప్రాయపడ్డారు.